NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు ఎస్పీగా సీ.హెచ్​.సుధీర్​ కుమార్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా ఎస్పీగా సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప ఐపీఎస్​ అనంతపురం బదిలీ కావడంతో నూతన ఎస్పీగా సీహెచ్​ సుధీర్​కుమార్​ రెడ్డి పదవిని అలంకరించారు. 2010 సివిల్స్​ బ్యాచ్​లో సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి కర్ణాటక క్యాడర్​ ఐపీఎస్​కు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట స్వస్థలం , పుదుచ్చేరి ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేశారు. ఇన్ఫోసిస్ లో రెండేళ్లు పని చేశారు. కర్ణాటకలో మొదటగా బత్కల్ ఏఎస్పీగా పని చేసి ఎస్పీగా పదోన్నతి పొందారు. బీదర్ , మాండ్య , దక్షిణ కన్నడ ( మంగళూరు ), బెల్గాం జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ కి డిప్యుటేషన్ పై వచ్చి ఎపి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పని చేస్తూ అక్కడి నుండి బదిలీ పై కర్నూలు జిల్లా ఎస్పీగా విచ్చేశారు కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎమ్. కె. రాధాక్రిష్ణ గారు, డిఎస్పీలు , సిఐలు ఉన్నారు.

About Author