చదివేది ఆరో తరగతి.. అకౌంట్లో 905 కోట్ల రూపాయలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : బీహార్ లోని కటిహార్ జిల్లాలోని పస్తియా గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆశిశ్ అనే ఆరో తరగతి విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 905 కోట్లు కనిపిస్తున్నాయి. ఈ బాలుడి అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం జమకావాల్సి ఉంది. కానీ ఇన్ని వందల కోట్లు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. మరో విద్యార్థి చరణ్ విశ్వాస్ అకౌంట్లో కూడ బ్యాలెన్స్ 6 కోట్లు దాక చూపిస్తోంది. దీంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. గ్రామస్థలందరూ బ్యాంకుకు క్యూ కట్టి .. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోయారు. విషయం బ్యాంకు మేనేజర్ దృష్టికి వెళ్లగానే గాబరా పడిపోయారు. వెంటనే ఆ రెండు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. విషయం పై అధికారుల దృష్టికి తీసుకుపోయి… ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.