చదివింది 8th క్లాస్ .. హెలీకాప్టర్ తయారీ..కానీ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆ యువకుడు చదివింది ఎనిమిదో తరగతి. కానీ ఉన్నత కలల కన్నాడు. కఠినమైన లక్ష్యాలను ఎంచుకున్నాడు. హెలీకాప్టర్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. హెలీకాప్టర్ తయారీ గురించి యూట్యూబ్ ద్వార తెలుసుకున్నాడు. కావాల్సిన పరికరాలు సమకూర్చుకున్నాడు. కానీ.. అతని ప్రయోగమే ప్రాణం తీసింది. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా మహాగావ్ తాలుకా పుల్సవంగికి చెందిన షేక్ ఇబ్రహీం సొంతంగా హెలీకాప్టర్ తయారు చేశాడు. సోదరుడి వెల్డింగ్ షాప్ లో పనిచేస్తూ .. అందులో ప్రావీణ్యం సంపాదించాడు. షేక్ ఇబ్రహీం తయారు చేసిన హెలీకాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించాడు. ఇంజిన్ స్టార్ట్ చేయగానే రోటర్ బ్లేడ్ విరిగి రెక్క ఊడిపోయింది. అది క్యాబిన్ లోపల ఉన్న ఇబ్రహీం కు తగలడంతో గొంతు తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. తన ఊరు , ప్రపంచం దృష్టి ఆకర్షించాలని కలలు కన్న ఇబ్రహీం కల నెరవేరకుండానే మరణించాడని గ్రామస్థులు వాపోయారు.