చదివింది ఇంటర్ .. నేడు ప్రపంచ ధనవంతుల జాబితాలో.. !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రపంచ 100 మంది ధనవంతుల జాబితాలో డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానికి చోటుదక్కింది. బ్లూమ్ బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ లో ఆయనకు 98వ స్థానం దక్కింది. దమానీ నికర సంపద 1,38,000 కోట్లుగా నిర్ధారించారు. 100 మంది టాప్ ధనవంతుల్లో మనదేశం నుంచి ముకేష్ అంబాని, గౌతమ్ అదానీ, అజీజ్ ప్రేమ్ జీ, పల్లోంజీ మిస్త్రీ, శివనాడార్, లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రాధాకిషన్ దమానీ చాలా సాధారణ స్థాయి నుంచి తన జీవితాన్ని ప్రారంభించారు. డిగ్రీ చదవుతూ మధ్యలోనే వదిలేశారు. స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తూ అసాధారణ స్థాయికి ఎదిగారు. అనంతరం అవెన్యూ సూపర్ మార్ట్స్ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ డిమార్ట్ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోంది.