PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చాగలమర్రిలో.. ఆడుదాం..ఆంధ్ర

1 min read

చాగలమర్రి, పల్లెవెలుగు:నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు  ఆడుదాం ఆంధ్ర క్రీడా వేడుకలను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తులసమ్మ, ఉప సర్పంచ్ షేక్ మొహమ్మద్ సోహెల్ లు మంగళవారం లాంచనంగా   ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా అత్యంత ప్రతిభ కనబరచే క్రీడాకారులు ఎందరో ఉన్నారని  వారిని గుర్తించుటకే  ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామస్థాయి నుండి జాతీయస్థాయి  వరకు యువకులను క్రీడా పోటీల్లో పాల్గొనుటకు అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని వారు తెలిపారు . క్రీడల వల్ల దారుఢ్యం  పెరిగి ఆరోగ్యవంతులు అవుతారన్నారు. అంతేకాక  అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఉన్నత చదువుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ సౌకర్యం ఉందని వారు తెలిపారు కనుక   ప్రాంతాల్లో గల యువతీ యువకులు ఈ క్రీడల పట్ల ఉత్సాహం చూపాలని వారు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహమ్మద్ దౌలా, తహసిల్దార్ సుభద్రమ్మ,  ప్రధానోపాధ్యాయుడు కోటయ్య,మండల ఉపాధ్యక్షుడు రఫీ, ఎంపీటీసీ ఫయాజ్  గ్రామపంచాయతీ ఈవో  నాగమణి పీ.డి దాదా పీర్,  ఈటి భారతి, పద్యాలు పాల్గొన్నారు.  అలాగే మండలంలోని చిన్న వంగలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా  ఆడుదాం ఆంధ్ర క్రీడలు ప్రధానోపాధ్యాయులు జీవయ్య పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి.  ఈ కార్యక్రమంలో చిన్న వంగలి సర్పంచ్ మౌళి భాష, పెద్ద వంగలి సర్పంచ్ బంగారు షరీఫ్ ఎంపీటీసీ లక్ష్మి రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

About Author