PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చాకలి ఐలమ్మ  ఆశయాలను కొనసాగిద్దాం

1 min read

హొళగుంద, పల్లెవెలుగు:  ప్రజల స్వేచ్చ  కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ ఈతరం మనం చరిత్ర గుర్తుపెట్టుకోవాలి ఆమె జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాలి తన పోరాట పటిమతో రజకులకు ఘన కీర్తిని సంపాదించి పెట్టిన మన రజక వీర వనిత చాకలి ఐలమ్మ చరిత్ర ఆంధ్ర తెలంగాణలకే కాక యావత్ భారతదేశంలో ఉన్న రజకులకు గర్వకారణమన్నార రజక సంఘం నాయకులు మంగయ్య లక్ష్మన్న lic.నాగరాజు మల్లికార్జున.మల్లి కరెంట్.రవి.రాజా.రామకృష్ణ. హనుమేష్ నగప్ప. మంగళవారం స్థానిక మడివాళా మాచయ్య స్వామి గుడిలో దగ్గర చాకలి ఐలమ్మ   జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పంచార్పించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1919 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామం లో వీర వనిత చాకలి ఐలమ్మ జన్మించిన్నారు. నల్లగొండ జిల్లా జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నరసయ్య తో 14 సంవత్సరాల వయసులో వివాహం చేశారు ఆమె వివాహం అనంతరం భర్తతో పాటు కలిసి ఆనాటి భూస్వాములు  ప్రజలపై దాడులు చేస్తున్న నిజాం నవాబుకు  సంబంధించిన రజాకార్లకు వ్యతిరేకంగా ఆమె ప్రజలను ఐక్యం చేసి పోరాటంలో పాల్గొన్నారు అప్పటికే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టులు నిజాం నవాబు గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆంధ్ర మహాసభ జరుపుతున్న పోరాటంలో వీర వనిత చాకలి ఐలమ్మ ఆమె భర్త ఇద్దరు పాల్గొన్నారు ఆ పోరాటంలో వీర వనిత చాకలి ఐలమ్మ ఆ నాటి కమ్యూనిస్టు నాయకులతో కలిసి  పోరాటాలు సాగించారు తదుపరి నిజాం సైన్యం అయినా రజాకార్లు స్థానిక భూస్వామ్యల గుండాలతో కలిసి ఆమె ఇంటి పై దాడి చేసి ఇంట్లో వస్తువులను దోచుకుని ఇంటికి నిప్పు పెట్టారు ఈ దాడి నుండి ఆమె తప్పించుకున్నది కానీ ఆమె కుమార్తె సోమ నరసమ్మ రజాకార్ల చేతిలో  అత్యాచారానికి బల్తైనది. ఆ తదుపరి జరిగిన పోరాటంలో పోలీసులు వీర వనిత చాకలి ఐలమ్మ భర్తను పట్టుకొని పోలీసులు పెట్టిన  నిచిత్రహింసలకు తట్టుకోలేక మరణించాడు. ఈ ఘటనతో మరింత చురుగ్గా పని చేయాలని నిర్ణయించుకుంది ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పాలకుర్తి విసునూరు దేశ్ముఖ్ నరసింహారెడ్డి ఎదుర్కొని వారి వారి దగ్గర ఉన్న ధనం భూములను పెద్ద ఎత్తున పేదలకు పంపిణీ చేయడంలో ఆమె కృషి ఉన్నది భూమికోసం భుక్తి కోసం స్వాతంత్రం కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆమెకు స్వాతంత్రం అనంతరం తగిన గుర్తింపు గౌరవం లేక పోలేదు దు ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనమందరం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా నిజాం నవాబులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారు ఇది ప్రపంచ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ గారికి ఒక మంచి గుర్తింపు తెచ్చింది 1985 సెప్టెంబర్ 10 తారీకు నాడు అనారోగ్యంతో ఆమె మరణించారు. ఆమె ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాలన్నారు.

About Author