NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చలివేంద్రం ప్రారంభం..

1 min read

– మానవత మూర్తి బి.వి కృష్ణారెడ్డి.. జిల్లా గవర్నర్ డాక్టర్:పంకజక్షన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు హేలాపురి లైన్స్ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్ ఆర్ పేట కేవీ సింగ్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి పక్కన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని లైన్స్ క్లబ్ ఏలూరు జిల్లా గవర్నర్ డాక్టర్ వి.కె పంక జాక్షన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, అనంతరం రోడ్డుపై వెళ్లే పాద చారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి కె పంకజక్షన్ మాట్లాడుతూ బివి కృష్ణారెడ్డి న్యాయవాదిగా, రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారని, ముఖ్యంగా వేసవికాలం ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు హేలాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దాసర గణేష్, కార్యదర్శి కె. శ్రీరామమూర్తి, ట్రెజరర్ ఆర్.పద్మకుమారి, లేళ్ల వెంకటేశ్వరరావు, కిషోర్, రెడ్ క్రాస్ వాలంటీర్లు వి నాగరాజు, కె శ్రీనివాస్, మహమ్మద్ సుదీర్ తదితరులు పాల్గొని వాహనదారులకు, పాదచారులకు దాహార్తిని తీర్చారు.

About Author