చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత
1 min read– చికిత్స పొందుతూ కొలుకోలేక మృతి… చల్లా మృతిని దృవీకరించిన కుటుంబసభ్యులు
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలంఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుచల్లా భగీరథరెడ్డి ఈరోజుతెల్లవారుజామున రెండు గంటలకు హైదరాబాదులోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం చల్ల భగీరథరెడ్డి గత రెండు రోజులుగా అనారోగ్య పరిస్థితుల కారణంగా హైదరాబాదులోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఈ రోజు 4 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే చల్లా అభిమానులు, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తండ్రి చల్ల రామకృష్ణారెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయాలకు అనుగుణంగా బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ యువ రాజకీయ నాయకుడుగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన అనారోగ్యానికి గురి మృతిచెందటం పట్ల పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చల్లా భగీరథ రెడ్డి నంద్యాల జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ,శ్రీదేవి దంపతులకు 1976 జన్మించారు. విద్యాభసం అనంతరం చల్లా భగీరథరెడ్డి తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశాడు. అనంతర రాజకీయ పరిణామాల్లో ఆయన తన తండ్రి చల్లాతో పాటు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 2019 మార్చిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ చల్లా రామకృష్ణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించడం అయితే ఆయన గత ఏడాది జనవరిలో మృతి చెందటంతో ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి భగీరథరెడ్డిని ఎంపికచేశారు. ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా శాసనసభ్యుల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో 2021 ఎప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. చల్లా భగీరథ రెడ్డి సతీమణి శ్రీమతి శ్రీలక్ష్మి ప్రస్తుతం జడ్పిటిసిగా కొనసాగుతున్నారు.