NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చలానాలు తక్షణమే చెల్లించాలి ..ఎస్ఐ మల్లికార్జున

1 min read

పల్లెవెలుగు వెబ్​ ,ఓర్వకల్: మోటార్ వాహన యజమానులు,తమ వాహనాల పైన ఉన్న పెండింగ్ ఈ చలానాలను ఎప్పటికి అప్పుడు ఏపీ ఈ చలాన్ యాప్ ద్వారా చెల్లించాలని సోమవారం నాడు ఓర్వకల్ ఎస్సై మల్లికార్జున వాహనదారులకు అవగాహన కల్పించారు , మీసేవ యందు కూడా చెల్లించవచ్చని . పెండింగ్లో ఈ చలానాలను వసూలు చేయుటకు పోలీసులు వాహనాలు తనిఖీ చేసిన సమయంలో మీ వాహనాల పైన అపరాధ రుసుము కలిగి ఉంటే వాహనం ను పోలీసులు సీజ్ చేస్తాన్నారు. వాహనదారుడు పెండింగ్ లో ఉన్న పూర్తి చలాన్ లు కట్టిన తరువాత మీ వాహనాలు విడుదల చేయించుకొన వలసి వస్తుంది. మార్గమధ్యం లో ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ వాహనాల పైన ఉన్న అపరాధ రుసుమును వెంటనే చెల్లించి పోలీసువారికి సహకరించాలని తెలిపారు. పోలీసు సిబ్బంది పెండింగ్లో ఉన్న ఈ చలానాలను వసూలు చేయు సమయంలో వాహనదారులు వాదనకు దిగి, పోలీసు సిబ్బంది తో గొడవ పడినచో చట్ట ప్రకారం వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author