చలో సంగమేశ్వరం సిద్దేశ్వరం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
1 min read– రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు.రాయలసీమ విద్యార్థి పోరాట సమితి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 28న జరిగే చలో సంగమేశ్వరం సిద్దేశ్వరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ లోని విజేత స్టడీ సర్కిల్,సక్సెస్ స్టడీ హాల్ లో చలో సంగమేశ్వరం సిద్దేశ్వరం కరపత్రాలను ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలను కలుపుతూ కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద నిర్మించ తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి ను రోడ్డు కం బ్యారేజ్ గా మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతం నీటి విషయంలో తీవ్రంగా నష్టపోయి కరువు వలసలతో కొట్టుమిట్టాడుతున్నదని ప్రతి సంవత్సరం రాయలసీమ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లి బ్రతుకుతున్నారని నీటి వసతి లేకపోవడంతో సరైన పంటలు రాక, గిట్టుబాటు ధరలు లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని నీటి విషయంలో రాయలసీమకు న్యాయం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రాయలసీమకు నీటి విషయంలో ఉపయోగపడే సంగమేశ్వరం సిద్దేశ్వరం వద్ద ఏర్పాటుచేసే ఐకానిక్ బ్రిడ్జి ను రోడ్డు కం బ్యారేజ్ గా మార్చాల్సిన అవసరం ఉందని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాలు భూములు కోల్పోయిన రాయలసీమ రైతులు సైతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమకు నీటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని వారు కోరారు అదేవిధంగా తక్షణమే కృష్ణానది యాజమాన్య బోర్డ్ ను రాయలసీమలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు 1953నుంచి 1956 వరకు కర్నూల్ లో కొనసాగిన రాజధాని నేడు లేకుండా పోయిందని రాయలసీమకు రావలసిన నీళ్లు నిధులు నియామకాల్లో న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే రాయలసీమలో కరువు వలసలు తీవ్రమవుతున్నాయని వీటిని నివారించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని అందులో భాగంగా తక్షణమే ఐకానిక్ బ్రిడ్జిను రోడ్డు కం బ్యారేజ్ గా మార్చాలని దానికోసం ఈనెల 28న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే చలో సంగమేశ్వరం సిద్దేశ్వరం కార్యక్రమాన్ని రాయలసీమ ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రకోట మల్లప్ప, వసంత్ కుమార్,తెర్నేకల్ రవికుమార్,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.