NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చమర్తి జగన్మోహన్ రాజుకి బ్రహ్మరథం పట్టిన మహిళల

1 min read

– బోయపాటివాండ్లపల్లెలో మంచినీటి బోరును ప్రారంభించిన జగన్మోహన్ రాజు
పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా వీరబల్లి:ప్రముఖ విద్యావేత్త, టిడిపి రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు గారు సోమవారం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం సోమవరం గ్రామ పంచాయతీలోని బోయపాటివాండ్లపల్లె లో పర్యటించారు. ఈ సంధర్భంగా జగన్మోహన్ రాజు గారికి మహిళలు, గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రాజు గారికి గజ మాలవేసి, అడుగడుగునా బాణా సంచా పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. బోయపాటివాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు ను జగన్మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయనకు మహిళలు, గ్రామస్థులు ప్రత్యేక దన్యవాదములు తెలిపారు. అనంతరం గ్రామస్తులందరూ కలిసి ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన భాద్యత మనందరి పై ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మహిళలు అన్ని రంగాలలో అభివృధ్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలన్నారు. భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసి టిడిపి భలోపేతం కోసం పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, టిడిపి సీనియర్ నాయకులు నాగసుబ్బయ్య నాయుడు, నారాయణ నాయుడు, రామ్మోహన్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, నాగేశ్వర నాయుడు, రాయ వెంకటేశ్వర్ల నాయుడు, గంగయ్య నాయుడు, రఘ నాయుడు, రమణ నాయుడు, ఉప సర్పంచ్ బాలకృష్ణ నాయుడు, మాజీ సర్పంచ్ వెంకట్రామ రాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాయ వెంకటరమణ, గ్రామ కమిటీ అద్యక్షులు అబ్బూరి నాగరాజ నాయుడు, ఆంజనేయులు రెడ్డి, భాస్కర్ రాజు, ప్రభాకర్ నాయుడు, రాజా రాజు, ప్రసాద్ రాజు, వెంకటరామరాజు, ఉపాద్యక్షులు దుర్గం ఆంజనేయులు, మహిళా కమిటీ అద్యక్షురాలు నాగసుబ్బమ్మ, నందకుమార్ నాయుడు, బండి రమణయ్య, గుదే స్వామికొండలు, అబ్బూరితిరుపతినా యిడు, బీసీ నాయకులు సుధాకర్, ఆంజనేయులు, తెలుగుయువత పార్లమెంట్ కార్యదర్శి నేతి రమేష్ బాబు, సుదాకర్ రాజు, నరసింహ నాయుడు, నాగప్ప నాయుడు, డ్రైవర్ శివ, ఐ టిడిపి పవన్, మహేష్, వి.ఆంజనేయులు, రామక్రిష్ణ రాజు, రాయ రమణ నాయుడు, చలపతి, సిద్దిరాజు, రాచ రాయుడు, బాల రాజు, వాసు రాజు, చంద్రశేఖర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author