PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించిన నేపథ్యంలో సోమవారం నుంచే రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ.. నగరవాసులను అప్రమత్తం చేసింది. ఉద్యోగులు, వాహనదారులు వెంటనే ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. అలాగే, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.

                                            

About Author