NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చండీగ‌ఢ్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ఆప్ అనూహ్య విజ‌యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఛ‌ండీగ‌ఢ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అనూహ్య విజ‌యం సాధించింది. తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆప్.. 35 సీట్ల‌లో 14 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. గత పర్యాయం 20 సీట్లు గెలుచుకున్న బీజేపీని వెనక్కి నెట్టేసింది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ ఒక సీటుకు పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య ఫలితాలపై ‘ఆప్‍’ సంబరాలు చేసుకుంటోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది ‘ట్రయిలర్’ అని ఆ పార్టీ అభివర్ణించింది. ఈ విజయం పై ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇది మార్పుకు సంకేతమ‌ని పేర్కొన్నారు.

                       

About Author