వారి పేర్లు వాడకుండా చంద్రబాబు, పవన్ గెలవలేరు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు వాడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్తే గుండు సున్నాతో సమానమని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. కనీస పరపక్వతలేని, రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ అని నాని విమర్శించారు. ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గుండు సున్నాతో సమానం. వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓటు లేనీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి.. 60 శాతం ఓటింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏం చేయగలరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు
అని కామెంట్స్ చేశారు.