చంద్రబాబు, వైఎస్ఆర్ మంచి స్నేహితులు !
1 min readపల్లెవెలుగువెబ్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుల మధ్య స్నేహం గురించి వైఎస్సార్ ఆత్మగా పేరు పడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్సార్, చంద్రబాబుల స్నేహాన్ని కేవీపీ ప్రస్తావించారు. వైఎస్సార్, చంద్రబాబులు మంచి మిత్రులని చెప్పిన కేవీవీ.. వారిద్దరూ రోజుకు కనీసం రెండు, మూడు సార్లయినా మాట్లాడుకునే వారని, లేదంటే కలిసే వారని కేవీపీ అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరే దాకా వైఎస్సార్, చంద్రబాబుల మధ్య స్నేహం కొనసాగిందని ఆయన చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు టీడీపీలో చేరిపోయారో… అప్పటి నుంచి వారి స్నేహం నిలిచిపోయిందని కూడా కేవీపీ చెప్పారు.