బుద్దా వెంకన్న అరెస్టును ఖండించిన చంద్రబాబు
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మంత్రి కొడాలి కేసినోపై ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమని దుయ్యబట్టారు. బుద్దా వెంకన్నపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.