ప్రజల మేలు కోరుకునే నేత చంద్రబాబు.. టి.జి భరత్
1 min read– చంద్రబాబుకు మద్దతుగా 92612 92612 నంబర్ కు ప్రజలంతా మిస్డ్ కాల్ ఇవ్వాలి.. టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద పార్టీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలందరూ ముందుకు వస్తున్నారన్నారు. అందుకే బాబుతో నేను అంటూ చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు తీసుకువచ్చిన ఈ 92612 92612 నంబర్ కు అందరూ మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. నేతలు ఈ నంబర్ కు ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపేలా చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రజా సేవకే అంకితమన్నారు. కేవలం రాష్ట్ర ప్రజల మేలు కోసమే ఆయన రాజకీయాల్లో ఉన్నారని టిజి భరత్ అన్నారు. ఈ దీక్షలో టిడిపి నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.