పొత్తుల పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
1 min read
పల్లెవెలుగువెబ్ : రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల వ్యవహారంపై తానొక్కడే మొనగాడని సీఎం జగన్ విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ వామపక్షాలతో పొత్తులు పెట్టుకోలేదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలు ఇంకెంతో కాలం కొనసాగవని, ముగింపు పలకడానికి సమయం దగ్గరపడిందని హెచ్చరించారు.