అభద్రతాభావంలో చంద్రబాబు నాయుడు..
1 min read–ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ దెందులూరు పర్యటనలో భాగంగా దెందులూరు మండలంలో మాజీ ఉప ప్రధాని బాబు జగన్ జీవన్ రామ్ విగ్రహావిష్కరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏలూరు స్థానిక కలెక్టరేట్ కాంపౌండ్ డిస్టిక్ గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ లకు ఎన్నో ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఆయన పరిపాలనలో ఎస్సీలకు మంచే జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ కోసం అభద్రత భావంలో ఉండి. 40 ఇయర్స్ ఇండస్ట్రి అని చెప్పుకుంటూ పొంతన లేని సమాధానలు చెబుతున్నారన్నరు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసని, ఇప్పటి ప్రస్తుత పరిణామాలు కాలం నిర్ణయిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ దళిత జేఏసీ చైర్మన్ జాతీయ అధ్యక్షులు పెరికె వరప్రసాద రావు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, ఏపీ ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ , ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు యర్రా నాగమల్లేశ్వరరావు, బడుగు రామకృష్ణ తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.