NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ పై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి , దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. వైఎస్ కుమారుడు జ‌గ‌న్‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న బాబు వైఎస్‌ను కొనియాడ‌టం విశేషం. ”అమ‌రావ‌తి వివాదాలు – వాస్త‌వాలు” పేరుతో రచయిత కందుల ర‌మేష్ ర‌చించిన పుస్త‌కావిష్క‌ర‌ణ విజయవాడలో జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర‌బాబు మాట్లాడుతూ హైద‌రాబాద్‌లో తాను ప్రారంభించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను త‌ర్వాత ముఖ్య‌మంత్రి అయిన వైఎస్ ఏనాడూ ఆపేయాలనుకోలేద‌న్నారు. ఇలా ఎప్పుడైనా ఆపేయాలి అన్న చ‌ర్చ జ‌రిగిందా? ఇక్క‌డే ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అడిగాన‌న్నారు. ఎప్పుడూ అలా చేయ‌లేద‌ని క‌న్నా చెప్పారు. ఎందుకంటే ఆయ‌న వైఎస్ హ‌యాంలో మంత్రిగా చేశారని చంద్రబాబు అన్నారు.

                                         

About Author