36గంటలపాటు నిరసన దీక్షకు సిద్ధమైన చంద్రబాబు!
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న అనూహ్య పరిణామాలు, తెదేపా పార్టీ కార్యాలయాలపై వైసీపీ మూకుమ్మడి దాడుల నేపథ్యంలో టీడీపీ అదినేత చంద్రబాబు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఈమేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి నిరసనగా రేపటి నుంచి 36గంటలపాటు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద దీక్షకు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువాం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల దాకా చంద్రబాబు నిరసన దీక్షకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది.