NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

12న సొంత నియోజకవర్గానికి చంద్రబాబు!

1 min read

పల్లెవెలుగువెబ్​, చిత్తూరు: 12వ తేదీన టీటీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో కుప్పం నియోజకవ్గంలో వైసీపీ అధిక స్థానాలు కైవసం చేసుకున్న క్రమంలో చంద్రబాబు పట్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మూడురోజులపాటు కొసాగే బాబు పర్యటనలో 12న కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. 13న శాంతిపురం, రామకుప్పం, 14న కుప్పం రూరల్​ మండలాల్లో పర్యటిస్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు త్వరలో ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో ముందస్తుగా సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజులపాటు పర్యటించి ప్రజానాడిని అంచనా వేయనున్నారు. కాగా తిరుమలలో జరుగుతోన్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11, 12వ తేదీల్లో సీఎం వైఎస్​.జగన్​ తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పంకు రానున్నడం గమనార్హం.

About Author