వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
1 min read
పల్లెవెలుగు వెబ్, కడప: టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు.
ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట, నందలూరు ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. రేపు చిత్తూరు జిల్లా, ఎల్లుండి నెల్లూరు జిల్లాలో వరద బాధితులను పరామర్శించనున్నారు.