ఎన్టీఆర్ అల్లుడిని పరామర్శించిన చంద్రబాబు
1 min readపల్లెవెలుగువెబ్ : అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమాజీమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి భర్త. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబు నాయుడు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటితో చంద్రబాబుకు దూరం పెరిగింది. దశాబ్దాల పాటు రెండు కుటుంబాల మధ్య విబేధాలు కొనసాగాయి. ఇటీవల కొద్ది కాలం నుంచి రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలుగుతున్నాయి. ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు.