డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే చంద్రబాబు అరెస్టు.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని ధర్నాచౌక్ లో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటి నుండి ప్రజల ద్రుష్టి మరల్చేందుకే చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోందన్నారు. ప్రజలందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలిపేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారన్నారు. అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో ఉందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు సరైన విధంగా స్పందించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పక్క రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నిజాయితీ తెలుసుకోవచ్చన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అయినందుకే ప్రజల నుండి మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్రం అభివ్రుద్ది కావాలంటే భవిష్యత్తులో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ప్రజలంతా తమ ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు వినోద్ చౌదరీ, రాజ్ కుమార్, రామాంజనేయులు, చంద్రమోహన్, మోహన్, శ్రీధర్, ఏసు, రాజ్యలక్ష్మి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.