PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు అరెస్టు అన్యాయం….

1 min read

– వైకాపాలో ప్రతిపక్ష నేతలకు తిట్టిన వారికే పదవులు.. : మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్రమంతా ప్రతిపక్ష నేతకు మద్దతు చంద్రబాబు అరెస్టుపై భగ్గుమంటున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైకాపాకు రాజకీయ సమాధి కడతారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మండల కేంద్రంలో బాబుకు తోడుగా మూడో రోజు రిలే నిరాహార దీక్ష మండల టిడిపి అధ్యక్షులు దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ దీక్షకు పాణ్యం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, మాజీ ఎంపీపీ పొంగాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సీతారామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ. ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేశారని ఇది హేయమైన చర్య అని అన్నారు. దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి మేధావులు అరెస్టును ఖండిస్తున్నారని. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం జరిగిందనీ తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రజలు ఎవరు సంతోషంగా లేరన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈసారి ప్రజలు వైకాపాకు రాజకీయ సమాధి కడతారన్నారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాకు వచ్చాని అతను చూసి దొంగల్లా ఉదయం చుట్టుముట్టి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారన్నారు  రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఒకవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్రతో ప్రజలకు వెళ్లి ప్రభుత్వం వైఖరిని ఎండగడుతున్నారని టిడిపికి ఆదరణ పెరుగుతుందని తప్పుడు ఆలోచనతోనే అరెస్టు చేయించారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడని చంద్రబాబును కూడా 16 నిమిషాలైనా జైల్లో ఉంచాలని దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 330 కోట్లు కుంభకోణం జరిగింది చంద్రబాబునాయుడు తిన్నారని చెబుతున్నారు. సి మెన్స్ మరియు డిజైన్ టెక్ రెండు కంపెనీలు భాగస్వామ్యంతోనే ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందన్నారు. 3300 కోట్లు కంపెనీ వారి పెట్టుబడి పెడితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా పదిశాతం అంటే 330 కోట్లు మాత్రమే దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఎండి మొత్తం డేటా పొందుపరిచారని ఎక్కడ కూడా నిధులు దారి మళ్లినట్టు అవినీతి జరిగినట్టు లేదని ఆయన చెప్పారన్నారు. అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ వల్ల దాదాపు 3 లక్షల మంది యువత శిక్షణ పొందారని అందులో 85 వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. నీతికి నిజాయితీకి నిలువుటద్దం చంద్రబాబు అని 45 ఏళ్ల రాజకీయంలో సీఎంగా ప్రతిపక్ష నాయకులుగా ప్రస్తుతం కూడా ప్రతిపక్ష నాయకులు గానే పనిచేస్తున్నారని రాష్ట్రం విడిపోయి కూడా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. రిమాండు రద్దు చేయాలన్న ఉద్దేశంతో కోర్టులో వాదనలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు. ఎంత దూరమైనా న్యాయ పోరాటం చేస్తాం కామ ప్రజా క్షేత్రంలో నిర్దోషిగా బయటకు వస్తామన్నారు కసితో పట్టుదలతో ప్రతి నాయకులు కార్యకర్తలు పని చేయాలని సూచించారు నాయకుని అక్రమ అరెస్టును ప్రజలకు తీసుకెళ్లి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయించుకోవాలన్నారు హైదరాబాదులో ఐటి ఉద్యోగులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి భారీగా ధర్నా చేశారు. ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేసే చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంట రామచంద్ర రెడ్డి ,దిలీప్ రెడ్డి, మల్లికార్జున్ నాయుడు, చినుకూరు అనసూయమ్మ, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, కృష్ణ యాదవ్ శ్రీనివాస యాదవ్ ఒడ్డు లక్ష్మీదేవి కరిమద్దెల ఈశ్వర్ రెడ్డి, శివారెడ్డి. గని హర్ష, వండుట్ల సర్పంచ్ గంగాధర్ రెడ్డి, యువ నాయకుడు గణేష్ రెడ్డి, రాచమల్ల శీను, తదితరులు పాల్గొన్నారు.

About Author