PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా నిరాహార దీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టు కు నిరసనగా ఈ రోజు తేది 10.09.2023న కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ (శ్రీ క్రిష్ణ దేవరాయ సర్కిల్, గౌరు గోపాల్ ఆసుపత్రి ఎదురుగా) జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, యం.యల్.సి శ్రీ బి.టి.నాయుడు , ఇతర నాయకులు నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. కార్యక్రమంలొ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, పి.జి.నరసిమ్హులు యాదవ్, పోతురాజు రవి కుమార్ రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు జె.తిరుపాల్ బాబు, నంది మధు, పరమేశ్, సంజీవ లక్ష్మి, దాశెట్టి శ్రీనివాసులు, గోపినాథ్ యాదవ్, సోమిశెట్టి నవీన్, ఎల్లప్ప, సుభాష్ చంద్ర బోస్, కార్పోరేటర్లు జక్రియా అక్సారి, రమణమ్మ, పార్లమెంట్ అనుబంధ కమిటీ అధ్యక్షులు యస్.అబ్బాస్, కె.ఇ.జగదీశ్, ముంతాజ్, జేంస్, పి.హనుమంతరావు చౌదరి,వై.నరసిమ్హులు, సత్రం రామక్రిష్ణుడు, సుకన్య, లక్ష్మి దేవి, చంద్రకాంత్, గున్నా మార్క్, మొతిలాల్, మాధవస్వామి, రమణ, సుందర్ రాజ్, అఖిల్, వినోద్, బేస్త శ్రీనివాసులు, ప్రభాకర్, దశరథ నాయుడు, గణేశ్, కిరణ్, రామాంజనేయులు, ఎల్లా గౌడ్, నాగేశ్వర రావు మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నీతి నిజాయితీ గల నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సైకో సీఎం ప్రతిపక్ష నాయకులను వేధించడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ నాలుగు  సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రతిపక్ష నాయకులను ఎంతోమందిని అరెస్టు చేసి వేధించారని, చివరకు తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా వేధించి ఆనందించేందుకే సిఐడిచే అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. అక్రమ ఆస్తుల కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్ పై ఉన్న వ్యక్తులు కూడా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలేని తమ నాయకుడి పై రాజకీయ కక్ష సాధింపు ధోరణితో అరెస్టు చేసి వేధించడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కేసులో అక్రమంగా అరెస్టు అయిన తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారని వారు దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి అన్న మాటే లేదని, ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుందని అన్నారు .టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పై కేసు ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

About Author