చంద్రబాబు రాజకీయ జీవితం మచ్చలేని తెల్ల కాగితం.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మచ్చలేని తెల్లకాగితం లాంటిదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టిజివి ట్రేడ్ యూనియన్ నేతలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ రాజకీయాల్లో చంద్రబాబు డబ్బు సంపాదన కోసం లేరని.. కేవలం రాష్ట్ర అభివ్రుద్ది కోసమే ఉన్నారన్నారు. చంద్రబాబు అరెస్టుతో మన రాష్ట్రంతో పాటు ప్రక్కన ఉన్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, యూ.ఎస్, యూరప్ లో కూడా ప్రజలు బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడంతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. 2047 విజన్ పెట్టుకొని రాష్ట్ర అభివ్రుద్ది విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారన్నారు. రోజూ ప్రజల మధ్య ఉండే ఆయనకు ఇప్పుడు జైలులో సమయం దొరికిందని.. దీంతో అభివ్రుద్ది విషయంలో ఇంకా ఆలోచించే సమయం ఆయనకు దొరికినట్లయిందన్నారు. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను దేశ ప్రజలందరికీ తెలిసేలా నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు కూడా ఆలోచించాలని.. చంద్రబాబు మీధ కక్ష్య తప్ప ఈ కేసులో ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్రం అభివ్రుద్ది చెందుతుందన్నారు. టిజివి ట్రేడ్ యూనియన్ నేతలు స్వతహాగా ముందుకు వచ్చి దీక్ష చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీక్షలో అధ్యక్షులు బాలయ్య, సెక్రటరీ శేషగిరి శెట్టి, టౌన్ కమిటి నరసింహులు, రవి, ప్రభాకర్, మార్కెట్ యార్డుకు చెందిన కాటాదారుల సంఘం, రోలాయింపు సంఘం, ఆటో యూనియన్ సంఘాల నాయకులు, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు పాల్గొన్నారు.