PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లానాయ‌క్ పై చంద్ర‌బాబు స్పంద‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా చంద్ర‌బాబు స్పందించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

                           `             

About Author