చంద్రబాబు విజన్‌తో రాష్ట్రం అభివృద్ధి.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: చంద్రబాబు నాయుడు విజన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని సి.క్యాంపులోని ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా కార్యాలయంలో ఆయన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన వారితో చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రంలో తెలంగాణాకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు టి.జి భరత్ గుర్తుచేశారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదని చెప్పారు. ఈ ఐదేళ్లు రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడినపడుతుంద్నారు. తమ ప్రభుత్వం వస్తే సకాలంలో పెన్షన్ అందిస్తామన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఉన్న 6 వేల మంది పెన్షనర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టి.జి భరత్ కోరారు. ఇక కర్నూల్లో తాము దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్తుంటారని.. స్థానికంగా ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా తప్పకుండా కృషి చేస్తానని టి.జి భరత్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శివారెడ్డి, ట్రెజరర్ రాజారావ్, మాజీ అధ్యక్షుడు మద్దిలేటి రెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ పాపారావ్, రిటైర్డ్ జైళ్లశాఖ అధికారి నాగేశ్వరరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ పక్కీరయ్య, రిటైర్డ్ ఆర్.టి.ఓ శ్రీధర్, ఆర్జా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.