ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు జస్టిస్ చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ లలిత్., తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ ను సిఫారసు చేయగా… సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని ఇదివరకే కేంద్రం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.