PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు సహకార సొసైటీ ఛైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్ , గడివేముల: మండలానికి చెందిన రైతు సహకార సొసైటీ ఛైర్మన్ గా పోగుల చంద్రశేఖర్ రెడ్డి(బిల్కల గుడుర్)..డైరెక్టర్ లు గా నంద్యాల వెంకటేశ్వర్లు. జీ వీ రవీంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం నంద్యాల సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారులు తిరుపాలయ్య.బాషా. సీ ఈ ఓ ఆదినారాయణ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గం మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమపై నమ్మకం ఉంచి పాలకవర్గం చైర్మన్ డైరెక్టర్లు గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరిచడంతోపాటు వారికి రుణాలు, సబ్సిడీపై యంత్ర పరికరాలు మంజూరు అయ్యేలా చేస్తామన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా జెడ్ పి టి సి అభ్యర్థి ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

About Author