PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రయాన్ -3 విజయోత్సవ సంబరాలు: కరెస్పాండెంట్ తాజుద్దీన్

1 min read

– జాతీయ జెండాలతో విద్యార్థుల సంబరాలు

– చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెద్ద కబేలా లో

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  చైతన్య ఇంగ్లీష్ మీడియం  స్కూల్‌ విద్యార్థులు చంద్రయాన్‌ – 3 విజయోత్సవ సంబరాలు జరుపు కున్నారు. గురువారం పట్టణంలోని పెద్ద కబేలా లోని చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో  చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతంపై విద్యార్థు లు కేరింతలు..చప్పట్లతో సంబరాల్లో మునిగిపో యారు. ఈ సందర్భంగా చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ తాజుద్దీన్ మాట్లాడుతూ చంద్రయాన్‌–3 విజయవంతంతో భాతరదేశం అంతరిక్ష పరిశోధనల్లో మైలురాయిని చేరుకుందని, ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు శుభాక్షాంక్షలు తెలిపారు. ప్రా థమికస్థాయి నుంచే అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పిస్తే విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు మరియు  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author