PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో మార్పు కేవలం కూటమితోనే సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ- జేఎస్సీ-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అని నందికొట్కూరు టిడిపి జనసేన బిజేపి నాయకులు గిత్త జయసూర్య ,నల్లమల రవికుమార్, కుమార్ తెలియజేశారు. నందికొట్కూరు పటణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి  కూటమి అభ్యర్థి గిత్త జయసూర్య ఆదేశాల మేరకు గురువారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతకట్టాయి. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, ఆంధ్రప్రదేశ్లోని దుష్టశక్తులను ఓడించేందుకు ఈ కూటమిగా ప్రజల్లోకి వస్తున్నాం. దార్శనికత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్దత కలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సంపద సృష్టించి ప్రతీ ఆంధ్రునికి అండగా నిలుస్తుంది. రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛలేదు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గత ఐదేళ్లలో దళితులపై 6000 కేసులు పెట్టారన్నారు.

188 మంది దళితులు హత్యకు గురయ్యారు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్ రెడ్డి ఏ ఒక్క ఘటనపై కూడా స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్సీ దళితుడిని చంపి, అతని మృతదేహాన్ని డోర్ డెలివరి చేసినప్పుడు ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి దానిపై కూడా స్పందించలేదు. ఈ అరాచకాలపై దళితులు అంతా ఏకం కావాలి. మే 13న మీ ఓటును కూటమి అభ్యర్ధులు వేయాలి. టీడీపీ, ఎన్డీయే కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటుంది. జగన్ రెడ్డి యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి, కూటమికి ప్రజలు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఎసీఎ కూటమిలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత టిడిపి-జెఎస్పి-బిజెపి కూటమి తీసుకుంటుంది. రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిగా ఏర్పాటు అయ్యాయి. ఇప్పటికైనా జగన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోకుంటే కుక్కలు చింపిన విస్తరిగా రాష్ట్రం మారుతుందని విమర్శించారు. ఏపీ యువతకు అవసరమైన నమ్మకాని, వారి భవిష్యత్తుకు కావాల్సిన భరోసాను జగన్ రెడ్డి ఈ జన్మకు ఇవ్వలేడు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ నాటికి ఎవరికీ జీతాలు అందడం లేదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి. పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందుతుంది. టీడీపీ, బీజేపీ, జేఎస్సీ చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఆర్ధికంగా దివాళా తీసిన రాష్ట్రానికి జవసత్వాలు అందించాలనే లక్ష్యంతో మూడు పార్టీలు జతకట్టాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మా కూటమి అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆర్ధిక పరిమితులు ఉన్నప్పటికీ మేము అనేక నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాము. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్థిక అవరోధాలున్నప్పటికీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఐదేళ్లలో నీటిపారుదల రంగానికి టీడీపీ రూ.68 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద రూ. 3000 ఇస్తాము. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఏటా రూ. 15,000 ఇస్తాము. అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20,000 అందజేస్తామన్నారు.

దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తాం. నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500 ఇస్తాము. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తాం. టీడీపీ-జేఎస్సీ-బీజేపీ కూటమి 50 ఏళ్లు పైబడిన బీసీలకు రూ.4,000 పెన్షన్ ఇస్తుంది. అలాగే వృద్ధాప్య పింఛనును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతాం. ప్రతీ నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకే పింఛను అందజేస్తాం. మహిళలకు నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు కలలకు రేకలు పథకం కింద వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. జగన్ మోహన్ రెడ్డి పై చేస్తున్న ఈ పోరాటంలో మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగళం. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం సానుకూల మార్పు తీసుకొస్తాం అన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author