ఇంటింటి సర్వేలో మార్పులు.. చేర్పుల పై సమావేశం..
1 min read– పాల్గొన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరన్ రిజిస్ట్రేషన్ అధికారి, ముఖ్య కార్యనిర్వహణాధికారి
– కె.వి.ఎస్.ఆర్ రవికుమార్
– ఎటువంటి అభ్యంతరాలు లేవని, సంతృప్తి వ్యక్తం చేసిన అన్ని పార్టీల నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవారి అదేశముల ననుసరించి SSR-2024 లో భాగముగా నెం, 65, ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గమునకు సంబంధించి ఇంటింటి సర్వే నందు వచ్చిన చేర్పులు మరియు తొలగింపులకు సంబంధించి అభ్యంతరాలు తెలుసుకొనేందుకు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము, ఏలూరు నందు బుధవారం సమావేశము ఏర్పాటు చేయడమైనది. సదరు సమావేశమునకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన, బి.ఎస్.పి.సి.పి.ఐ, సి.పి.ఐ (ఎం), మొదలగు పార్టీల వారు హాజరైనారు.నెం. 65, ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గములో ఇంటింటి సర్వే, ఓటర్ల నమోదు ప్రక్రియ, తొలగింపులు, మార్పులు చేర్పులు మొదలగు వాటిపై చర్చించిన తదుపరి అన్ని రాజకీయ పార్టీల వారు ఓటర్ల జాబితా సవరణలపై తమకు ఎటు వంటి అభ్యంతరములు లేవని, చాలా పారదర్సకముగా ఇంటింటి సర్వే జరుగుచున్నదని సంతృప్తిని వ్యక్తము చేసినారు.ఈ సమావేశములో నెం. 65, ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గము ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ముఖ్య కార్య నిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్ వారు అయిన కె.వి.ఎస్.ఆర్ రవికుమార్ , అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులైన మున్సిపల్ కమిషనర్ ఏలూరు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏలూరు, తహసిల్దార్ ఏలూరువారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని, ఏలూరు వారు మరియు వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.