26న విరామ దర్శనము వేళలో మార్పులు
1 min read
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై. చంద్రచూడ్ ఈ నెల 25 మరియు 26వ తేదీలలో శ్రీ స్వామివార్ల దర్శనార్ధమై శ్రీశైలక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటనను పురస్కరించుకుని 26వ తేదీ ( ఆదివారం) ఉదయం వేళలో విఐపి బ్రేక్ దర్శనాలు మరియు శ్రీస్వామివారి స్పర్శదర్శన టికెట్లునిలుపుదల చేయబడ్డాయి.ఆ రోజు ఉదయం జరిగే 6.30గంటలకు నిర్వహించబడే సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేయబడ్డాయి.ఆదివారం రోజున మధ్యాహ్నవేళలో అనగా 11.45 గంటలకు విఐపి బ్రేక్ దర్శనాలు, 12.30 గంటలకు స్పర్శదర్శనాలు ( రూ.500/-లు రుసుము) కల్పించబడుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు సామూహిక అభిషేకాలు కూడా యథావిధిగానిర్వహించబడుతాయి.కావున భక్తులు ఈ మార్పును గమనించవలసినదిగా తెలియజేయడమైనది.