NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్టా చట్టంలో మార్పులు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కేంద్రం తీసుకొచ్చిన మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా ఏపీ వాల్టా చ‌ట్టంలో మార్పులు తీసుకురావాల‌ని పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాద‌న‌ల్లో భాగంగా పారిశ్రామిక అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్న భూగ‌ర్భ జ‌లాల‌పై నిర్ణీత చార్జీలు వ‌సూలు చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఆయ‌న సూచించారు. తాగునీటి అవ‌స‌రాలు, వ్యవ‌సాయం కోసం వాడుకునే భూగ‌ర్భ జ‌లాల‌పై ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌రాదని స్పష్టం చేశారు. ప‌రిశ్రమ‌ల‌పై ఎక్కువ భారం ప‌డ‌కుండా చూసుకోవాల‌ని తెలిపారు. చిన్న ప‌రిశ్రమ‌ల ప‌ట్ల ఉదారంగా వ్యవ‌హ‌రించాల‌ని కోరారు. భూగ‌ర్భ జ‌లాల‌ను అధికంగా వినియోగంచే ప‌రిశ్రమ‌లపై దృష్టి సారించాల‌ని చెప్పారు.

About Author