PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి : జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ‘‘కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి. మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

                                    

About Author