NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం..

1 min read

భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదట తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుక దంపతుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణాన్ని కాటన్ పాడు, చిలబోయినపల్లి, మిదిండ్రంపాలెం, సత్రంపాడు భజన మండలి చెందిన 108 మంది తరలివచ్చి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. భక్తుల హనుమాన్ చాలీసా సంకీర్తన గానంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముండూరు యాజ్ఞవల్క్య రాజాశ్రమము శ్రీ కృష చరణానంద భారతి  స్వామీ, చెన్ను శ్రీనివాసరావు, ఆంజనేయులు, కోడూరి లక్ష్మీనారాయణ, గుమ్మడి చైతన్య, ఎం కృష్ణారావు , పంచకర్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

About Author