PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తి భావంతో రామ నామ జపం…

1 min read

అయోధ్య బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హిందూ సోదరుల ర్యాలీ..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  అభిజిత్ లగ్నంలో అయోధ్యలో బాల రామయ్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా  సోమవారం నాడు హిందూ సోదరుల ఆధ్వర్యంలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అత్యంత వైభవంగా పూలమాలలతో అలంకరించి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ, కీర్తనలు ,భజనలు చేస్తూ భక్తి భావంతో రామ నామ జపం చేస్తూ పండగ వాతావరణం లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మండపం వద్ద శ్రీ సీతా సమేత రామయ్య, లక్ష్మణ, హనుమాన్ ఉత్సవ విగ్రహాలను ఉంచి భజన  నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రధాన అర్చకులు కొండూరు ఆదినారాయణ శర్మ మహా మంగళహారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి పాఠశాల హెచ్ ఎం రామేశ్వరరావు, రాఘవేంద్ర, కృష్ణ కాంత్, రవి,  ఆర్యవైశ్య సోదరులు, హిందూ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గని గ్రామంలోని శ్రీరాముల దేవాలయంలో భక్తులు స్థానిక వైసిపి నాయకుడు గని ప్రతాప్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు.

About Author