ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయండి..
1 min readనగర మేయర్ కె. సురేష్ బాబు..
పల్లెవెలుగు వెబ్, కడప: నగరంలో వివిధ దుకాణాల నుంచి పెండింగ్లో ఉన్న ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయాలని కడప నగర మేయర్ కె. సురేష్ బాబు శానిటేషన్ సెక్రటరిలను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగరంలో రూ.3 కోట్లు వసూలు కావాల్సి ఉందని, దుకాణాల యాజమాన్యాల దగ్గర వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. సమావేశం నందు కడప నగరపాలక సంస్థ కమీషనర్ లవన్న , సూపరింటెండెంట్, ఇంజనీర్ , ఎక్సికుటివ్ ఇంజనీర్ , హెల్త్ ఆఫీసర్ , కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.