1 నుంచి చార్జీలు పెరుగుతాయ్..!
1 min readపల్లెవెలుగు వెబ్: విమాన చార్జీలు జూన్ 1 నుంచి పెరగనున్నాయి. విమాన చార్జీల లోయర్ పరిమితిని జూన్ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ఎగువ పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 40 నిమిషాల ప్రయాణానికి రూ.2300 నుంచి రూ.2600 కు పెరుగుతుంది. 40 నుంచి 60 నిమిషాల ప్రయాణానికి రూ.2900 నుంచి రూ.3300 కు పెరగుతుంది. 60 నుంచి 90 నిమిషాలకు రూ.4000, 90 నుంచి 120 నిమిషాలకు రూ.4700, 120 నుంచి 150 నిమిషాలకు రూ.6100, 120 నుంచి 180 నిమిషాలకు రూ.8700 రూపాయలు పెరగనున్నాయి. దీంతో దేశీ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది.