కొణిదేల’లో అంగరంగ వైభవంగా రథోత్సవం..
1 min read
హాజరైన మాండ్ర మరియు ఎమ్మెల్యే
డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పరిధిలోని కొణిదేల గ్రామంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి మహోత్సవం ఆలయ ఈవో ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు.వారు ప్రత్యేకంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించారు అనంతరం రథోత్సవాన్ని భక్తాదులు ఇరువైపులా తాళ్లు పట్టుకుంటూ రథోత్సవాన్ని తీసుకువెళ్లారు.గ్రామ ప్రజలు మహిళలు చిన్నారులు మరియు బంధుమిత్రులు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు.సాయంత్రం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణ,రూరల్ సీఐలు వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,టి.సుబ్రహ్మణ్యం,సర్కిల్ ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, ఓబులేష్,తిరుపాలు,శరత్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
