PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం

1 min read

– ప్రశాంతంగా ముగిసిన రథోత్సవ కార్యక్రమం -స్వామివారిని దర్శించుకున్న అశేష భక్తజనం
– సీఐ సుధాకర్ రెడ్డి,ఎస్ఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు
– అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి రథోత్సవంప్రశాంతంగా ముగిసిన రథోత్సవ కార్యక్రమం
– స్వామివారిని దర్శించుకున్న అశేష భక్తజనం
– సీఐ సుధాకర్ రెడ్డి,ఎస్ఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మిడుతూరులో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ రథోత్సవ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈ.గుర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.రథోత్సవాన్ని ప్రత్యేక అలంకరణ చేశారు.చుట్టు ప్రక్క ప్రాంతాలు అయిన పీరు సాహెబ్ పేట,చింతలపల్లి మరియు మిడుతూరు మండల కేంద్రంతో పాటుగా వివిధ గ్రామాల నుంచి భారీగా పిల్లలు,మహిళలు,యువకులు,వృద్ధులు సైతం లెక్కచేయకుండా వేలాది మంది వచ్చి ఈరథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిలకించారు.ఉదయం నుంచే భక్తాదులు చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా టెంకాయలు సమర్పిస్తూ మ్రోక్కుబడులను తీర్చుకున్నారు.ఈరథోత్సవ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, నందికొట్కూరు వైసీపీ నాయకులు వై.చంద్రమౌళి,తువ్వా లోకేశ్వర రెడ్డి,తువ్వా రామ నాగేశ్వర రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు
శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా నందికొట్కూరు రూరల్ సీఐ జి.సుధాకర్ రెడ్డి మరియు మిడుతూరు ఎస్ఐ జి.మారుతి శంకర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈబందోబస్తులో నందికొట్కూరు అర్బన్ సీఐ విజయభాస్కర్,బ్రాహ్మణ కొట్టుకూరు,జూపాడుబంగ్లా ఎస్సైలు ఓబులేష్,వెంకటసుబ్బయ్య,ఏఎస్ఐ సుబ్బయ్య మరియు వివిధ స్టేషన్ల లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు మరియు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

About Author