కర్నూలు లలితాదేవి ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని శ్రీలలితాంబికా దేవాలయం నందు నిర్వహించిన మేడా భవానీ బృందం కుంకుమార్చన సహిత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం బాలికలకు కుమారి పూజ, రాఘవేంద్రనేతృత్వంలో శ్రీ రాఘవేంద్ర కోలాట బృందంచే కోలాటాలు, కుమారి సత్యస్నేహితచే భరతనాట్యం ( మహిషాసుర మర్దిని), చూపరులను కనువిందు చేశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, లలితా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, కర్నూలు సి.డి.పి.ఒ. వరలక్ష్మీ, శ్రీలక్ష్మి విద్యాసంస్థల కరెస్పాండెట్ శ్రావ్యా కార్తిక్ , డాక్టర్ రామ్మూర్తి, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి బైసాని అంజనీ సురేశ్ కుమార్, డివిఆర్ జూవెలర్స్ రాంప్రసాద్, అన్నపూర్ణ పర్ప్యుమర్స్ యజమాని ఇల్లూరు నాగరాజుగుప్తా, జయం మంజునాథ్, హెల్త్ & గ్రో ఓబులచంద్రారెడ్డి, లలితా పీఠం సభ్యులు పూరి చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.