PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారుమంచాల గ్రామంలో ప్రారంభమైన ధార్మిక కార్యక్రమాలు

1 min read

– మానవీయ విలువలకు ప్రతిరూపం శ్రీమద్రామాయణం

– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జూపాడుబంగ్లా మండలం,  పారుమంచాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్  ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు  హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు మేడా సుబ్రహ్మణ్యం స్వామి  శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. బుధవారం మహాభారతం, గురువారం శ్రీమద్భగవద్గీత, శుక్రవారం ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నర్రెద్దుల శ్రీనివాసులు రెడ్డి, ఇ.నారాయణరెడ్డి, పి.శివారెడ్డి, ఎస్.వెంకటేశ్వరరెడ్డి, కె.జనార్ధన రెడ్డి, అర్చకులు వేదాంతం శేషభట్టాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు వేంకటరెడ్డి శ్రీమద్రామాయణంపై ప్రారంభోపన్యాసం చేస్తూ  ఈ భూమిపై జన్మించిన ప్రతి మానవుడు ఎలా నడుచుకొనవలెనో నేర్పుతుందని అన్నారు. ఆధునిక కాలంలో ఎన్ని చదువులు చదివినా, శాంతి కలుగకపోగా అశాంతికి, అభద్రతకు గురవుతున్నారని, యువతతో  పాటు అందరు కూడా శ్రీమద్రామాయణం అధ్యయనం చేస్తే తనతో పాటు సమాజానికి మేలు చేసిన వారవుతారని, ఉన్నతమైన మానవీయ విలువలకు పునాది అవుతుందని అన్నారు. నాలుగు రోజుల కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు మండ్ల పాలరాముడు, పి.రామచంద్రుడు, గ్రంధె పెద్ద బాబు, చిన్న బాబు, కె.దివాకర రెడ్డి, బి.శ్రీనివాసులు, జి.వేణుగోపాల్, సి.చెన్నప్పనాయుడు, మంగళి సుబ్బడు, యం.సుబ్బన్న, వెంకటరమణ, ఎస్.వెంకటస్వామి, మధునాయుడు, హరికుమార్, ఆంజనేయులు, జోగి పెద్దాంజనేయులుతో  పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author