PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యములో అన్నదానం

1 min read

పల్లెవెలుగు ,రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ సభ్యులు లయన్ పవన్ కుమారుడు హితేశ్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా మదనపల్లి రోడ్డు మార్గాన నివసిస్తున్న పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు లయన్​ పవన్​ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన , పెళ్లి రోజు వేడుకలను పేద ప్రజల మధ్య జరుపుకోవాలన్నారు. కరోనా కష్ట కాలములో ఉపాధి లేక చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారికి ఆకలి తీర్చడం గొప్ప పుణ్య కార్యమన్నారు. ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమం క్లబ్​ అధ్యక్షులు లయన్ చాన్ బాషా, వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ హరినాథ్ రెడ్డి , ఉపాధ్యక్షులు లయన్ హరీష్ చంద్ర , లయన్ జంగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author