NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగువెబ్​, రాయచోటి : లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో శనివారం రాయచోటి వాస్తవ్యులు కోప్పల గంగిరెడ్డి మరియు శ్రీమతి సావిత్రమ్మ గార్ల మనవడు కుశాల్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో స్థానిక మదనపల్లి రోడ్డు మరియు సుద్దల వాండ్ల పల్లి రోడ్డు మార్గాన నివసిస్తున్న పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు .అనంతరం దాత కోప్పల గంగ రెడ్డి గారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారు రాయచోటి నియోజకవర్గం లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాటిని చూసి మేము కూడా మా వంతుగా పేదప్రజలకు సహాయం చేయాలన్న సంకల్పంతో లైన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ద్వారా శనివారం మా మనవడు పుట్టినరోజు పురస్కరించుకొని 120 మందికి భోజనం ప్యాకెట్లు అందించడం చాలా సంతోషకరమని తెలియజేశారు .అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ లయన్ హరినాధ్ రెడ్డి గారు మాట్లాడుతూ పుట్టిన రోజు మరియు పెళ్లి రోజులకు ఇతర శుభకార్యాలలో అనవసరమైన ఖర్చులు చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author