NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలో బండపల్లి సమీపంలో ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రమంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు లయన్ ఛాన్ బాష తెలిపారు.ఈ కార్యక్రమం రాయచోటి వాస్తవ్యులు ప్రవీ ణ్ కుమార్ రెడ్డి ఇంద్రాణి గార్ల కుమారుడు నీరజ్ కుమార్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా గారు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజు మరియు ఇతర శుభ కార్యాలను ఇలా పేద ప్రజల మధ్య జరుపుకోవడం అభినందనీయమని ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం గొప్ప పుణ్య కార్యమన్నారు .తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవాళ్లను గౌరవించడం బాల్యం నుంచి నేర్పిస్తే ఇలా అనాధ ఆశ్రమాలు భవిష్యత్ లో ఉండవని ఈ కరోనా కష్టకాలం లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు మన లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం దాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మా కుమారుడు నిరజ్ కుమార్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని అంగు ఆర్భాటాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలు నిర్వహించాలని గొప్ప సంకల్పంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారిచే ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.మన లయన్స్ క్లబ్ ద్వారా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానాని తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు,ఆశ్రమము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author