PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో కొండ్రెడ్డి చిన్నప్ప రెడ్డి జ్ఞాపకార్తం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో స్థానిక బండ పల్లె ప్రేమాలయం వృద్ధాశ్రమం నందు అన్నదానం నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధంతి , పుట్టిన రోజులు పేద ప్రజల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం గొప్ప పుణ్య కార్యమని , తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవాళ్లకు గౌరవించడం బాల్యం నుంచి నేర్పిస్తే ఇలా అనాధ ఆశ్రమాలు భవిష్యత్ లో ఉండవన్నారు. అనంతరం చిన్నప్ప రెడ్డి గారి కుమారుడు మనోజ్ రెడ్డి మాట్లాడుతూ మా తండ్రి చిన్నప్ప రెడ్డి గారి జ్ఞాపకర్తం ఆయనను స్మరించుకుని ఎప్పటి లాగే ప్రేమాలయం ఆశ్రమములో అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారిచే నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన లయన్స్ క్లబ్ ద్వారా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానాని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు,ఆశ్రమము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author